ఆఫ్ఘనిస్థాన్ లో భారీ పేలుడు... 28 మంది మృతి
Advertisement
ఆఫ్ఘనిస్థాన్ లో ఓ మసీదులో భారీ పేలుడు జరిగిన ఘటనలో 28 మంది మృతి చెందారు. తూర్పు ఆఫ్ఘనిస్థాన్ లోని నంగర్ హార్ ప్రావిన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో 55 మంది క్షతగాత్రులయ్యారు. గాయాలపాలైన వారిని హస్కా మినా ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ భారీ పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. నంగర్ హార్ ప్రావిన్స్ లో తాలిబన్లు, ఐసిస్ ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువ. ఆఫ్ఘనిస్థాన్ లో ఈ మధ్య కాలంలో జరిగిన హింసాత్మక ఘటనల గురించి ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించిన మరుసటి రోజే ఈ పేలుడు జరిగింది.
Fri, Oct 18, 2019, 08:27 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View