ట్రంప్ కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ షాక్!
Advertisement
ఒక దేశాధ్యక్షుడిగా ఉంటూ తనను  ఆదేశిస్తూ లేఖ రాస్తారా అంటూ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరియాలో కుర్దుల స్థావరాలపై దాడులకు పాల్పడుతున్న టర్కీ సైన్యం వేలాది మంది అమాయకుల ప్రాణాలను తీస్తున్నదని ట్రంప్ తన లేఖలో పేర్కొన్నారు. దాడులను ఆపకపోతే మీరు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.

 అంతేకాక, టర్కీపై ఆంక్షలు విధించేలా తనను పురికొల్పవద్దని.. ఆ విధంగా చేస్తే.. నేను కూడా టర్కీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన వాడిగా చరిత్రలో నిలిచిపోతానని  ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై ఎర్డోగాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఒక దేశాధ్యక్షుడు మరో దేశాధ్యక్షుడికి లేఖ రాసే విధానమిదేనా? అంటూ ట్రంప్ తీరుపై నిరసన వెళ్లగక్కాడు. అంతటితో ఆగక దేశంలో కుర్దులు నివాసముండే ప్రాంతాలపై తాజాగా దాడులు చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీచేశారు.
Fri, Oct 18, 2019, 07:40 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View