ఏపీలో జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థకు తొలి టెండర్
Advertisement
రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్ అయినా న్యాయపరమైన పరిశీలనకు వెళ్లాల్సిందేనని సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగా న్యాయనిపుణులతో ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్ పర్యవేక్షణలో జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ కార్యకలాపాలు కొనసాగించనుంది.

కాగా, జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత తొలి టెండర్ పరిశీలనకు రానుంది. రాష్ట్రంలో 108, 104 వైద్య సేవల కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించనుంది. వచ్చే టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 108, 104 నిర్వహణ వివరాలను తెలియజేయాల్సిందిగా జ్యుడీషియల్ ప్రివ్యూ వైద్య ఆరోగ్యశాఖను కోరింది.
Fri, Oct 18, 2019, 07:28 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View