ఇసుక కొరతపై మరోసారి ఆందోళనకు దిగనున్న టీడీపీ
Advertisement
ఇసుక కొరతపై మరోసారి ఆందోళనకు టీడీపీ సిద్ధమైంది. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లో సామూహిక నిరాహారదీక్షలకు దిగనున్నట్టు చెప్పారు.

 తమతో కలిసొచ్చే పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని ఈ నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు. ఇసుక కొరత కారణంగా సంబంధిత విభాగాల్లో పని చేసే కార్మికులు కుదేలైన నేపథ్యంలో ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని వర్ల రామయ్య పేర్కొన్నారు.
Fri, Oct 18, 2019, 07:07 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View