తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్
Advertisement .b
'ఇస్మార్ట్ శంకర్' తో తన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన రామ్, తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. స్రవంతి బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. 'థాడమ్' అనే తమిళ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా నిర్మితం కానుంది. తమిళంలో మగిల్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు.

ఈ ఏడాది మార్చిలో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆ సినిమాను రామ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తన కెరియర్లో తొలిసారిగా రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో నాయికలుగా నివేదా పేతురేజ్ .. మాళవిక శర్మ అలరించనున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Fri, Oct 18, 2019, 05:15 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View