దీపావళి కానుకగా బన్నీ మూవీ నుంచి మరో సాంగ్
Advertisement .b
అల్లు అర్జున్ తాజా చిత్రంగా 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఆ దిశగానే చకచకా షూటింగును కానిచ్చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి 'సామజ వర గమన' పాటను రిలీజ్ చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో జనంలోకి ఇంత వేగంగా దూసుకెళ్లిన సాంగ్ ఇదే.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను వదలడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు. ఇది పూర్తిగా మాస్ ఆడియన్స్ ను అలరించే పాట అని అంటున్నారు. దీపావళి కానుకగా ఈ మాస్ మసాలా సాంగ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పాట స్థాయికి తగిన విధంగా రెండవ పాట కూడా వుంటుందా అనే ఆసక్తితో బన్నీ అభిమానులు వున్నారు.
Fri, Oct 18, 2019, 04:23 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View