మూడు రోజులుగా ఆసుపత్రిలో బాలీవుడ్ నటుడు అమితాబ్‌
Advertisement
బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మూడు రోజులుగా ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆయన కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఐసీయూ తరహా సదుపాయాలుండే గదిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

బిగ్ బీని చూసేందుకు గానూ కుటుంబ సభ్యులు ప్రతి రోజు అక్కడికి వస్తున్నారు. ఈ విషయంపై నానావతి ఆసుపత్రి సిబ్బంది స్పందించారు. ఆయన రెగ్యులర్‌గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తమే ఇందులో చేరారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని  చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
Fri, Oct 18, 2019, 10:30 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View