గంగూలీ క్రికెట్ ఎలా ఆడాడో బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా అలాగే పనిచేస్తాడు: సచిన్
Advertisement
ఓ క్రికెటర్ బీసీసీఐ పగ్గాలు చేపడుతుండడంతో భారత క్రికెట్ వర్గాల్లో ఆనందం పొంగిపొర్లుతోంది. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరికొన్ని రోజుల్లో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గంగూలీ రాక కచ్చితంగా భారత క్రికెట్ కు మేలు చేసే అంశమని మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నారు. భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కాబోతుండడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు.

 గంగూలీ ఎంతో తపనతో, అభిరుచితో క్రికెట్ ఆడాడని, ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగానూ అదే అంకితభావం కనబరుస్తాడని భావిస్తున్నట్టు తెలిపారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా విశేషంగా సేవలందించాడని, కొత్త బాధ్యతల్లోనూ అదే సమర్థత కనబరుస్తాడనడంలో తనకెలాంటి సందేహం లేదని అన్నారు.
Thu, Oct 17, 2019, 09:54 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View