వరల్డ్ చాంపియన్ పీవీ సింధుపై కొరియా టీనేజి అమ్మాయి సంచలన విజయం
Advertisement
ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్ లోనే నిష్ర్కమించింది. మహిళల సింగిల్స్ లో ఐదో సీడెడ్ గా బరిలోకి దిగిన సింధు కొరియా సంచలనం,అన్ సీడెడ్ క్రీడాకారిణి 17 ఏళ్ల ఆన్ సే యంగ్ చేతిలో వరుస గేముల్లో ఓడి టోర్నీ నుంచి తప్పుకుంది. తొలి గేమ్ ను 14-21 పాయింట్లతో ప్రత్యర్థికి పోగుట్టుకున్న సింధు రెండో గేమ్ లో పుంజుకున్నట్లు కనిపించినప్పటికి ఆన్ సే అద్భుత ఆటతో రాణించటంతో సింధు 17-21 తేడాతో గేమ్ ను మ్యాచ్ ను పోగొట్టుకుంది.  

 ఈ సీజన్ బీడబ్ల్యుఎఫ్  వరల్డ్ టూర్ ఈవెంట్లలో  క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో సింధు విఫలం కావటం మూడోసారి. గత నెలలో జరిగిన చైనా ఓపెన్ లో తొలి రౌండ్లోనే పరాజయం పొందిన సింధు, కొరియా ఓపెన్లో రెండో రౌండ్లో ఓటమి పాలైంది.  వరల్డ్ నెంబర్ 6 సింధు ఆగస్ట్ లో ప్రపంచ చాంపియన్ గా గెలిచిన తర్వాత ఒక్క బీడబ్ల్యుఎఫ్ టోర్నీ సొంతం చేసుకోలేకపోయింది.

 మహిళల సింగిల్స్ లో బరిలోకి మరో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించింది. అటు పురుషుల సింగిల్స్ లో సాయిప్రణీత్ కూడా రెండో రౌండ్లో జపాన్ కు చెందిన వరల్డ్ నెంబర్ వన్ కెంటో మొమొట చేతిలో ఓడగా, మరో సింగిల్స్ పోటీలో సమీర్ వర్మ చైనా ఆటగాడు చెన్ లాంగ్ చేతిలో పరాజయం పాలైనాడు.
Thu, Oct 17, 2019, 09:40 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View