బిర్యానీలో తల వెంట్రుకలు... సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కు భారీ జరిమానా
Advertisement
సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ బిర్యానీ అంటే లొట్టలేయని వాళ్లు ఉండరు! ప్యారడైజ్ బిర్యానీ ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారని ఎంతో పేరుంది. అయితే, ఇప్పుడా హోటల్ కు జీహెచ్ఎంసీ అధికారులు భారీగా జరిమానా వడ్డించారు. అందుకు కారణం తల వెంట్రుకలు! ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో తల వెంట్రుకలు కనిపించాయి. దీనిపై ఆ వ్యక్తి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

 ప్యారడైజ్ పీఆర్వో రాఘవ దురుసుగా జవాబివ్వడంతో ఆ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు ప్యారడైజ్ హోటల్లో తనిఖీలు చేసి అనేక లోపాలు ఉన్నట్టు గుర్తించారు. లోపాలు సరిదిద్దుకోకపోతే వారం రోజుల్లో హోటల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్యలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందంటూ లక్ష రూపాయలు జరిమానా విధించారు.
Thu, Oct 17, 2019, 09:17 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View