ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు: పేర్ని నాని ఆగ్రహం
Advertisement
ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కొన్ని తెలుగు మీడియా సంస్థలపై విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. గ్రామ సచివాలయ నియామక పరీక్ష పేపర్ లీకైందని రాశారని, అలాగే అధికారుల బదిలీలపైనా  కథనాలు ప్రచురించారని మండిపడ్డారు. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వ్యాఖ్యలు చేస్తూ, ఆయనకు పాత్రికేయ విలువలు లేవని అన్నారు. ప్రభుత్వంపై అసత్య కథనాలు రాస్తూ, సీఎం జగన్ పై విషం చిమ్ముతున్నారని ఆరోపణలు చేశారు.
Thu, Oct 17, 2019, 09:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View