త్వరలో పీవోకే మనదవుతుంది.. వ్యూహ రచన జరుగుతోంది: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ
Advertisement
అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, ఇందుకోసం వ్యూహ రచన కొనసాగిస్తోందని అన్నారు. గుజరాత్ లో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో రూపానీ ప్రచార సభలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దుకు సంబంధించిన హామీని బీజేపీ నెరవేర్చిందని పేర్కొన్నారు. ఇదే రీతిలో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామన్న హామీని కూడా నెరవేరుస్తామన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత ఆలయ నిర్మాణ పనులు చేపడతామన్నారు.
Thu, Oct 17, 2019, 08:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View