ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోండి... ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు
Advertisement
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఇటు కార్మికులు, అటు ప్రభుత్వం పట్టువిడవకపోవడంతో ప్రజా రవాణా మందగించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తాజా పరిస్థితిపై స్పందించారు. ఆర్టీసీ సమ్మెతో సామాన్యులు ఇబ్బంది పడకుండా చూడాలని రాష్ట్ర యంత్రాంగానికి స్పష్టం చేశారు.

సమ్మె కారణంగా సర్వీసులు నిలిచిపోయిన క్రమంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ కార్యదర్శిని ఆదేశించారు. సమ్మెపై పలు ఫిర్యాదులు అందాయని తమిళిసై తెలిపారు. సమ్మెపై అన్ని చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్ కు తెలిపారు. సామాన్యులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా చూస్తున్నామని ఆయన వివరించారు.
Thu, Oct 17, 2019, 07:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View