చంద్రబాబు మాట మార్చారు... మోదీ మెడలు వంచుతామన్నది నిజం కాదా?: సోము వీర్రాజు
Advertisement
ప్రధాని నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు గతం మర్చిపోకూడదని బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మోదీని తిట్టడం కోసం ధర్మపోరాట దీక్షలు పెట్టించింది ఎవరు? మోదీపై నందమూరి బాలకృష్ణ, గల్లా జయదేవ్ లతో విమర్శలు చేయించింది ఎవరు? మోదీ మెడలు వంచుతామని అన్నది చంద్రబాబు కాదా? రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో మోదీ పవిత్రజలాలు పంపితే అవమానించింది చంద్రబాబు కాదా? అంటూ విమర్శల జడివాన కురిపించారు.

ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే మరోవైపు మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయించారని సోము వీర్రాజు ఆరోపించారు. గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో బీజేపీతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో చంద్రబాబులో అభద్రతా భావం ఎక్కువైందని, అందుకే ఇప్పుడు స్వరం మార్చారని వ్యాఖ్యానించారు.
Thu, Oct 17, 2019, 05:42 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View