సంక్రాంతి బరిలోకి 'ఎంతమంచివాడవురా'
Advertisement
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సతీశ్ వేగేశ్న మంచి పేరు తెచ్చుకున్నాడు. 'శతమానం భవతి'.. 'శ్రీనివాస కల్యాణం' చిత్రాలు ఆయన మార్కును ఆవిష్కరిస్తాయి. అదే తరహాలో ఆయన 'ఎంతమంచివాడవురా' సినిమాను రూపొందించాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను చేశాడు. టైటిల్ కి మంచి మార్కులు పడ్డాయి.

 గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం కావడంతో సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారు. ఆ దిశగానే తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి గట్టిపోటీ వుంది. 'సరిలేరు నీకెవ్వరు' .. 'అల వైకుంఠపురములో' సంక్రాంతికి రావడం ఖరారైపోయింది. 'వెంకీమామ' కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 10వ తేదీనే రజనీ 'దర్బార్' వచ్చేస్తుందని అంటున్నారు. ఇంత పోటీ ఉన్నప్పటికీ 'ఎంత మంచివాడవురా' వెనకడుగు వేయడం లేదని చెప్పుకుంటున్నారు.
Thu, Oct 17, 2019, 04:49 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View