'తాజ్ మహల్'.. 'పెళ్లి సందడి' సినిమాలు నేను చేయాల్సినవి: సీనియర్ హీరో శ్రీనివాస వర్మ
Advertisement
తెలుగులో 'సర్పయాగం' సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన శ్రీనివాస వర్మ, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. "తెలుగుతో పాటు నేను తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలతో బిజీ అయ్యాను. అలా నేను వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్ కి తరలి వచ్చేసింది.

అయితే తమిళ సినిమాల కారణంగా నేను రాలేకపోయాను. ఆ సమయంలోనే 'తాజ్ మహల్' సినిమా కోసం రామానాయుడుగారు అడిగారు. అలాగే 'పెళ్లి సందడి' సినిమా కోసం రాఘవేంద్రరావుగారు అడిగారు. అప్పట్లో వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం వల్లనే ఆ సినిమాలు చేయలేకపోయాను. ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఆ సినిమాలు చేసుంటే నా కెరియర్ మరోలా ఉండేది" అంటూ చెప్పుకొచ్చారు.
Thu, Oct 17, 2019, 12:15 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View