కీర్తి సురేశ్ 'పెంగ్విన్' మూవీ నుంచి ఫస్టులుక్
Advertisement .b
కెరియర్ మొదలైన దగ్గర నుంచి కీర్తి సురేశ్ తమిళ సినిమాలకి అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఆమె 'పెంగ్విన్' సినిమాను చేస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, వైవిధ్యభరితమైన కథా కథనాలతో రూపొందుతోంది. కథ అంతా కూడా కీర్తి సురేశ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ రోజున కీర్తి సురేశ్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో ఆమె గర్భవతిగా కనిపిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్టోన్ బెంచ్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంతోష్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని కీర్తి సురేశ్ భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Thu, Oct 17, 2019, 12:00 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View