ముంబైలో ఆమీర్ ఖాన్ మా ఇంటిపక్కనే ఉండేవాడు.. మంచి స్నేహితుడు!: సీనియర్ హీరో శ్రీనివాస వర్మ
Advertisement
'సర్పయాగం' సినిమాలో యాంటీ హీరోగా చేసిన శ్రీనివాసవర్మను చాలా మంది ఇప్పటికీ మరిచిపోలేదు. చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ గురించిన విషయాలను ప్రస్తావించారు.

"మాది 'భీమవరం' .. చదువంతా కూడా ముంబైలోనే సాగింది. ఆమీర్ ఖాన్ మా ఇంటిపక్కనే ఉండేవాడు. మంచి స్నేహితుడు.. ఇద్దరం కలిసి క్రికెట్ ఆడేవాళ్లం. ఆమీర్ పట్టుబడితే ఒక సినిమాలో ఆయన స్నేహితుడిగా నటించాను. ఆయన ప్రోత్సాహంతోనే నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆమీర్ ఖాన్ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పినా, తెలుగు సినిమాల్లో హీరోగా చేయాలనే ఉద్దేశంతో చెన్నైకి మకాం మార్చాను. అదే సమయంలో 'సర్పయాగం' సినిమాలో యాంటీ హీరో పాత్ర చేసే ఆర్టిస్ట్ కోసం వెదుకుతున్నారు. నా గురించి తెలిసి నన్ను పిలిపించి ఓకే చేశారు. తొలి సినిమానే సురేశ్ ప్రొడక్షన్స్ లో చేయడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చారు.
Thu, Oct 17, 2019, 11:12 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View