గట్టి పోటీని లెక్కచేయని మెగా హీరో
Advertisement
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' రూపొందింది. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. తాత, మనవళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా నిన్న ప్రకటించారు. అయితే అదే రోజున బాలకృష్ణ 'రూలర్' .. రవితేజ 'డిస్కోరాజా' కూడా విడుదల కానున్నాయి.

బాలకృష్ణ - రవితేజ ఇద్దరూ కూడా సీనియర్ మాస్ హీరోలే. ఇద్దరికీ మాస్ ఫాలోయింగ్ విపరీతంగా వుంది. ఈ సమయంలో థియేటర్స్ కి వస్తే తేజు గట్టి పోటీనే ఎదుర్కోవలసి ఉంటుంది. అయినా లెక్కచేయకుండా ఆయన రంగంలోకి దిగడం విశేషం. బాలకృష్ణ చేసేది మాస్ యాక్షన్ మూవీ .. రవితేజ సినిమా కంటెంట్ డిఫరెంట్ .. తన సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కనుక, తేజు ధైర్యంతో ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Thu, Oct 17, 2019, 09:53 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View