కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్
Advertisement .b
తెలుగులో 'మహానటి' సినిమాతో కీర్తి సురేశ్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. లేడీ ఓరియెంటెడ్ కథలను కూడా ఆమె సమర్థవంతంగా నడిపించగలదనే నమ్మకాన్ని ఈ సినిమా కలిగించింది. దాంతో నాయికా ప్రాధాన్యత కలిగిన కథలను ఆమెతో చేయడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె నాగేశ్ కుకునూర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇంకా టైటిల్ ను నిర్ణయించని ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనుంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంతసేపటి క్రితం ఈ సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఓ గిరిజన యువతిగా ఆమె ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
Thu, Oct 17, 2019, 09:36 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View