కృష్ణవంశీ దర్శకుడిగా 'రంగమార్తాండ'!
Advertisement .b
కృష్ణవంశీ ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడనీ, ఆ సినిమా కోసం ఆయన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. అయితే కృష్ణవంశీ ఏ సినిమా చేస్తున్నాడు? అది ఎప్పుడు మొదలుకానుంది? అనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.

2016లో వచ్చిన మరాఠీ సినిమా 'నటసామ్రాట్'కి రీమేక్ గా కృష్ణవంశీ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'రంగమార్తాండ' అనే టైటిల్ ను ఖరారు చేసి, అధికారిక పోస్టర్ ను వదిలాడు.  మరాఠీలో నానాపటేకర్ చేసిన పాత్రలో ప్రకాశ్ రాజ్ .. ఆయన సరసన రమ్యకృష్ణ నటించనున్నారు. అభిషేక్ - మధు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 'శ్రీఆంజనేయం' తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది
Thu, Oct 17, 2019, 09:17 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View