సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  కీర్తి సురేశ్ లక్కీ ఛాన్స్ కొట్టినట్టు కోలీవుడ్ సమాచారం. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి  విదితమే. ఇందులో కథానాయికలుగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ నాయికగా కీర్తి సురేశ్ ని తీసుకుంటున్నట్టు సమాచారం.
*  కథానాయిక నయనతార ఐదవసారి తమిళ స్టార్ హీరో అజిత్ సరసన నటించే సూచనలు కనిపిస్తున్నాయి. అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు నయనతారను సంప్రదిస్తున్నారు.
*  ప్రస్తుతం 'వెంకీ మామ' చిత్రంలో నటిస్తున్న సీనియర్ నటుడు వెంకటేశ్ తన తదుపరి చిత్రాన్ని తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేయనున్నారు. వచ్చే నెలలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
Thu, Oct 17, 2019, 07:38 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View