'ప్రతిరోజూ పండగే' విడుదల తేదీ ఖరారు
Advertisement
సాయిధరమ్ తేజ్ మొదటి నుంచి కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలను ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆయన తన రూటు మార్చుకున్నాడు. మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' సినిమా చేస్తున్నాడు.

రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాత .. మనవడి అనుబంధం నేపథ్యంలో సాగే గ్రామీణ కథలో మనవడిగా సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఇక తాత పాత్రను సత్యరాజ్ పోషిస్తుండటం విశేషం.
Wed, Oct 16, 2019, 05:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View