తొలినాళ్లలో నేనూ మోసపోయిన వాడినే: హీరో నిఖిల్
Advertisement
'హ్యాపీడేస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, ఆ తరువాత తనని తాను మలచుకుంటూ యువ కథానాయకులకు గట్టిపోటీ ఇస్తూ వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు.

'హ్యాపీడేస్' ఆడిషన్స్ లో పాల్గొన్నాను .. వాళ్లు చెప్పింది బాగా చేశాను కూడా. అయినా నాకు పిలుపురాలేదు .. ఆ తరువాత నేను శేఖర్ కమ్ములగారి కంటపడటం వలన అదృష్టం కలిసొచ్చింది. ఆ సినిమాలో చేసినందుకుగాను ఆయన 25 వేలు ఇచ్చాడు. ఇక ఇండస్ట్రీలో మోసం చేసేవారు కూడా లేకపోలేదు. 'పదిలక్షలు పట్టుకొస్తే నువ్వే హీరో' అంటారు .. ఒకటి రెండు రోజులు షూటింగ్ చేసినట్టుగా బిల్డప్ ఇచ్చి అడ్రెస్ లేకుండా పోతారు. తొలినాళ్లలో ఇలాంటివారి చేతిలో నేనూ మోసపోయిన వాడినే" అని చెప్పుకొచ్చాడు.
Wed, Oct 16, 2019, 04:20 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View