'బిగిల్' ట్రైలర్ తో మరో రికార్డును సొంతం చేసుకున్న విజయ్
Advertisement .b
క్రితం ఏడాది దీపావళికి 'సర్కార్'తో వచ్చిన విజయ్ అనూహ్యమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ దీపావళికి కూడా ఆయన తన తాజా చిత్రంతో రావడానికి సిద్ధమవుతున్నాడు. 'తెరి' .. 'మెర్సల్' వంటి భారీ విజయాలను అందించిన అట్లీ కుమార్ దర్శకత్వంలో మూడో సినిమాగా విజయ్ 'బిగిల్' చేస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. వారం తిరక్కముందే ఈ ట్రైలర్ 29 మిలియన్ల వ్యూస్ ను .. 2 మిలియన్ల లైక్స్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డును సృష్టించింది. ఫుట్ బాల్ కోచ్ గా యంగ్ లుక్ తోను .. మాంసం వ్యాపారం చేసే మధ్యవయస్కుడి పాత్రలోను విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార కనిపించనుంది. విజయ్ కి .. అట్లీ కుమార్ కి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
Wed, Oct 16, 2019, 03:17 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View