మోహన్ లాల్ కారణంగానే చరణ్ చేతికి 'లూసిఫర్' రైట్స్!
Advertisement .b
ప్రస్తుతం చిరంజీవి .. కొరటాలతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి కెరియర్లో 152వ సినిమాగా ఇది వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా చరణ్ లైన్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో మలయాళంలో మోహన్ లాల్ నుంచి వచ్చిన 'లూసిఫర్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

చిరంజీవి హీరోగా ఆ సినిమాను రీమేక్ చేయడానికి చరణ్ రంగంలోకి దిగాడు .. ఆ రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో మోహన్ లాల్ ఆయనకి హెల్ప్ చేసినట్టుగా తెలుస్తోంది. 'లూసిఫర్' నిర్మాతలు ఇతర భాషల్లోను తామే ఈ సినిమాను నిర్మించాలనే ఉద్దేశంతో ఎవరికీ ఇవ్వకుండా తమ దగ్గరే హక్కులను ఉంచుకున్నారట. అయితే ఈ రీమేక్ రైట్స్ కోసం చరణ్ ప్రయత్నిస్తున్నాడని మోహన్ లాల్ కి తెలిసి, ఆ నిర్మాతలను ఒప్పించి రైట్స్ ఇప్పించినట్టుగా చెప్పుకుంటున్నారు. చిరంజీవితో మోహన్ లాల్ కి గల సాన్నిహిత్యమే ఇందుకు కారణమని అనుకుంటున్నారు.
Wed, Oct 16, 2019, 12:49 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View