అందుకే నేను నిర్మాతగా కూడా మారాల్సి వచ్చింది: 'ఎవ్వరికీ చెప్పొద్దు' హీరో రాకేశ్
Advertisement
తెలుగు ప్రేక్షకులను ఇటీవల పలకరించిన ప్రేమకథా చిత్రాలలో 'ఎవ్వరికీ చెప్పొద్దు' ఒకటి. ఈ సినిమా ద్వారా హీరోగా రాకేశ్ పరిచయమయ్యాడు. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ ..'బాహుబలి 2'లో నేను పోషించిన నెగిటివ్ రోల్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో విలన్ తరహా పాత్రలు చాలానే వచ్చాయి. కానీ నాకు హీరోగా తెరపై చూసుకోవాలని ఉండేది. అందువలన ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాను.

నేను హీరోగా అనుకున్న ఒకటి రెండు ప్రాజెక్టులు ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయాయి. అందువలన మరోసారి అలా జరగకూడదనే ఉద్దేశంతో నేనే నిర్మాతగా కూడా మారిపోయాను. ఎలాంటి ఇమేజ్ లేని నాపై డబ్బులు ఎందుకు పెట్టాలనే చాలామంది నిర్మాతలు ఆలోచించారు. అందువలన ఇక నేనే నిర్మాతగా రంగంలోకి దిగాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.
Wed, Oct 16, 2019, 12:23 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View