'చంద్రముఖి' తరువాత రజనీ సినిమాలో జ్యోతిక
Advertisement .b
రజనీకాంత్ తాజా చిత్రంగా రూపొందిన 'దర్బార్' .. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం రజనీ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రజనీ హిమాలయాల యాత్రలో వున్నారు. ఈ యాత్రను పూర్తిచేసుకుని వచ్చిన తరువాత ఆయన తన 168వ సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లనున్నారు.

మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో .. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. రజనీ సరసన నాయికగా మంజూ వారియర్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా తెరపైకి జ్యోతిక పేరు కూడా వచ్చింది. ఈ సినిమా కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. మరో కథానాయికగా గానీ .. కీలకమైన పాత్ర కోసం గాని ఆమెతో మాటలు జరుగుతూ ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'చంద్రముఖి'లో రజనీ .. జ్యోతిక కలిసి ఏ స్థాయిలో మెప్పించారనే విషయం తెలిసిందే.
Wed, Oct 16, 2019, 11:02 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View