వారసత్వంతో స్టార్స్ కాలేరు: దర్శకుడు తేజ
- స్టార్స్ కావడం అంత తేలిక కాదు
- కారవాన్ లో వుండేవారు స్టార్సే కాలేరు
- నటనను ఊపిరిగా భావించేవారే స్టార్స్ అవుతారన్న తేజ
Advertisement
జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా, తనకి నచ్చిన కథలను తేజ చేసుకుంటూ వెళుతుంటాడు. తాను అనుకున్న కథలో మార్పులకు పెద్దగా అంగీకరించని కారణంగానే తేజ పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి సుముఖతను చూపడు. విషయమేదైనా ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడేయడం ఆయన నైజం. అదే నైజాన్ని మరోసారి చూపిస్తూ వారసత్వ హీరోలను గురించి ప్రస్తావించాడు.
"స్టార్ హీరోలు కావడం అంత ఆషామాషీ విషయం కాదు. ఆత్మ - ఊపిరి అంతా నటనపైనే పెట్టి అహర్నిశలు కృషి చేసిన వారే స్టార్స్ అవుతారు. వారసత్వంతో ఎవరూ స్టార్స్ కాలేరు .. ఒకవేళ అయినా ఎక్కువకాలం నిలబడలేరు. నా దృష్టిలో కారవన్ లో ఉండేవారు స్టార్సే కాలేరు. తమ షాట్ పూర్తయిన తరువాత సెట్లోనే ఉంటూ ఇతర నటీనటుల నటనను పరిశీలించినవారే స్టార్స్ అవుతారు. అమితాబ్ .. చిరంజీవి .. ఆమీర్ అదే పనిచేశారు" అంటూ చెప్పుకొచ్చాడు.

Wed, Oct 16, 2019, 10:43 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com