'రొమాంటిక్' సినిమాలో పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ
Advertisement .b
పూరి జగన్నాథ్ సొంత బ్యానర్లో ఆయన తనయుడు ఆకాశ్ హీరోగా 'రొమాంటిక్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి కథ - మాటలు పూరి అందించగా, అనిల్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కేతిక శర్మ అనే కొత్త కథానాయిక పరిచయమవుతోంది.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారనేది తాజా సమాచారం. 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలోని పాత్ర తరహాలో ఆమె ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. సినిమా అంతా రమ్యకృష్ణ కనిపిస్తారనీ, ఆమె పాత్రను పూరి గొప్పగా డిజైన్ చేశాడని చెప్పుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల జాబితాలో ఈ పాత్ర కూడా చేరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Wed, Oct 16, 2019, 10:07 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View