'రాజుగారి గది 3' కథ వింటూ చాలాసార్లు భయపడ్డాను: హీరోయిన్ అవికా గోర్
Advertisement .b
తెలుగు తెరకి 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో పరిచయమైన అవికా గోర్, తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత చేసిన 'సినిమా చూపిస్త మావ' .. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైంది. కొన్ని కారణాల వలన గ్యాప్ తీసుకున్న ఆమె, తాజాగా 'రాజుగారి గది 3' చేసింది.

ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ .."నేను చేసిన పాత్రకి ముందుగా తమన్నాను అనుకున్నారు. ఆమె డేట్స్ కుదరకపోవడం వలన, కథ నా దగ్గరికి వచ్చింది. కథ వింటూ చాలాసార్లు భయపడ్డాను. చూసే వాళ్లకి కూడా అదే ఫీల్ కలుగుతుంది. ఈ కథను కాదని చెప్పడానికి కారణాలు కనిపించలేదు. కొత్త పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే ఓకే చెప్పాను. తప్పకుండా నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది" అని చెప్పుకొచ్చింది.
Wed, Oct 16, 2019, 09:47 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View