'రాజుగారి గది 3'లో నాది భావోద్వేగాలతో కూడిన పాత్ర: కమెడియన్ అలీ
Advertisement .b
ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు కథానాయకుడిగా 'రాజుగారి గది 3' రూపొందింది. అవికా గోర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజాగా ఈ సినిమాను గురించి కమెడియన్ అలీ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను ఒక ముఖ్యమైన పాత్రను పోషించాను. ఇంతవరకూ నేను పోషించిన పాత్రలు ఒక ఎత్తు .. ఈ సినిమాలోని పాత్ర ఒక ఎత్తు. భావోద్వేగాలతో కూడినదిగా ఈ పాత్రను ఓంకార్ చాలా చక్కగా మలిచాడు. ఒక దర్శకుడిగా పూర్తి క్లారిటీతో ఓంకార్ ఈ సినిమాను రూపొందించాడు. అందరి ఆర్టిస్టుల నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టాడు. మొదటి రెండు భాగాల కంటే ఎక్కువగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Tue, Oct 15, 2019, 05:36 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View