ఆ సినిమా షూటింగు సమయంలోనే విజయశాంతి తల్లి మరణించింది: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement .b
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో విజయశాంతి గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. 'అపూర్వ సహోదరులు' సినిమా షూటింగ్ మైసూర్ ప్యాలెస్ లో జరుగుతుండగా, వేరే సినిమా సిట్టింగ్ కోసం అక్కడ నేను రాఘవేంద్రరావుగారిని కలిశాను. ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా విజయశాంతి నటిస్తోంది. ఆ సమయంలోనే ఆమె తల్లిగారు చనిపోయినట్టుగా కబురు వచ్చింది.

అసలు విషయం విజయశాంతికి చెప్పకుండా చెన్నైలోని ఆమె ఇంటికి తీసుకెళ్లమని రాఘవేంద్రరావుగారు చెప్పారు. ఆ సమయంలో మా ఆవిడ కూడా నాతోనే వుంది. మేమిద్దరం కలిసి విజయశాంతిని వెంటబెట్టుకుని బయలుదేరాము. 'ఏం కాదమ్మా మీ అమ్మగారికి ఒంట్లో కాస్త నలతగా ఉందట .. అంతే. కంగారు పడవలసిన అవసరం లేదు' అని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పుకుంటూ ఇంటివరకూ తీసుకెళ్లాము. మొన్న 11వ తేదీన 'సరిలేరు నీకెవ్వరు' షూటింగులో నేను కలిసినప్పుడు విజయశాంతి ఈ విషయాన్ని గుర్తుచేసుకుంది" అని చెప్పుకొచ్చారు.
Tue, Oct 15, 2019, 04:38 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View