దేవాలయాల చుట్టూ జరిగే అవినీతిపై చిరూ పోరాటమే కొరటాల సినిమా?
Advertisement
ప్రాచీన ఆలయాలు .. వైభవంతో వెలుగొందుతోన్న ఆలయాల నిర్వహణలో అనేక లొసుగులు కనిపిస్తూ ఉంటాయి. ఆలయాల నిర్వహణలో రాజకీయనాయకుల పెత్తనం .. అధికారుల అవినీతి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. అలా దేవాలయాల చుట్టూ అల్లుకున్న అవినీతిని తన తాజా చిత్రంలో కొరటాల చూపించనున్నట్టు తెలుస్తోంది.

తన ప్రతి సినిమాలోను ఏదో ఒక సామాజిక సమస్యను గురించి ప్రస్తావిస్తూ ఆలోచించేలా చేయడం ఆయనకి అలవాటు. అలాగే చిరూతో తను చేయనున్న సినిమాకి ఆయన ఎంచుకున్న కథా వస్తువు ఇదేనని అంటున్నారు. ఈ సినిమాలో దేవాదాయశాఖలో ఉద్యోగి అయిన కథానాయకుడు, ఆ వ్యవస్థలోని అవినీతిని ఎలా అంతమొందించాడనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెబుతున్నారు. నవంబరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
Tue, Oct 15, 2019, 03:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View