అవును, నేను పారితోషికం పెంచిన మాట నిజమే: హీరోయిన్ తాప్సీ
Advertisement
తెలుగు తెరపై తెల్ల మందారంలా మెరిసిన తాప్సీ, యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. అయితే వరుస అవకాశాలతో పాటు వరుస విజయాలను దక్కించుకోలేకపోయింది. దాంతో సహజంగానే ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తమిళంలోను ఆమెకి దాదాపుగా ఇదే పరిస్థితి ఎదురైంది. అలాంటప్పుడే ఆమె హిందీ చిత్రపరిశ్రమపై దృష్టిపెట్టింది. అక్కడి నుంచి ఆమె వెనక్కి రావడానికి ఎక్కువ రోజులు పట్టవని చాలామందే అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమె అక్కడ నిలదొక్కుకుంది.

గ్లామర్ తో పాటు నటనకి అవకాశం వుండే పాత్రలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో అక్కడ ఆమెకి వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాప్సీ పారితోషికం పెంచేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ .."అవును, నేను పారితోషికం పెంచిన మాట నిజమే. నా డిమాండ్ కి తగినట్టుగానే నేను అడుగుతున్నాను. నిర్మాతలు సంతోషంగా ఇవ్వగలిగేంత వరకూ మాత్రమే నా పారితోషికం ఉంటుంది. నా పారితోషికం వాళ్లను ఇబ్బంది పెట్టేదిగా వుండదు. గతంలో అవకాశాల కోసం ఎదురుసూస్తూ ఉండేదానిని, ఇప్పుడు ఆ అవసరం లేకపోవడం ఆనందాన్నిస్తోంది" అని చెప్పుకొచ్చింది.
Tue, Oct 15, 2019, 02:35 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View