'జాను' నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుంది: సమంత
Advertisement .b
తమిళంలో క్రితం ఏడాది విజయంతో పాటు ప్రశంసలను అందుకున్న చిత్రాల జాబితాలో '96' ముందువరుసలో కనిపిస్తుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్ .. త్రిష పాత్రలో సమంత నటించారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సమంత తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేసింది.

"ఇంతవరకూ నేను చేసిన పాత్రలు ఒక ఎత్తు .. ఈ సినిమాలోని 'జాను' పాత్ర ఒక ఎత్తు. అందువలన ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేశాను. కచ్చితంగా ఇది నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుంది. విడుదల తరువాత ఈ సినిమాను చూసిన వాళ్లంతా ఇదే మాట చెబుతారనే నమ్మకం వుంది. ఇంత మంచి టీమ్ తో కలిసి పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా వుంది" అంటూ చెప్పుకొచ్చింది.
Tue, Oct 15, 2019, 02:01 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View