చాలా కాలం తరువాత కృష్ణవంశీ మూవీలో రమ్యకృష్ణ
Advertisement
తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికగా రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బాహుబలి' సినిమాలో ఆమె పోషించిన 'శివగామి' పాత్ర ఆమె స్థాయిని పెంచేసింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు రమ్యకృష్ణను తమ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా .. అదనపు బలంగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే త్వరలో రమ్యకృష్ణ .. కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. 'నక్షత్రం' తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ, ఒక విభిన్నమైన కథతో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాడట. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నాడని అంటున్నారు. అదే నిజమైతే 'శ్రీఆంజనేయం' తరువాత, అంటే 15 ఏళ్ల తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేసే సినిమా ఇదే అవుతుంది.
Tue, Oct 15, 2019, 01:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View