హీరోయిన్ పూర్ణపై కోపం రావడంతో ఇంటికి పంపించేయమని చెప్పాను: దర్శకుడు రవిబాబు
Advertisement .b
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ, 'అవును' సినిమా షూటింగు సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. 'అవును' సినిమాలో పూర్ణ స్నానం చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ దృశ్యాన్ని అద్దంలో నుంచి మసకగా చూపిస్తాము. అందుకే, ఆ దృశ్యం తెరపై ఎలా కనిపిస్తుందనే విషయాన్ని పూర్ణకు ముందుగానే చూపించాను. ఆమె ఓకే అన్న తరువాతనే షాట్ రెడీ చేశాను.

సీన్ మధ్యలో 'నేను చేయను' అంటూ ఆ అమ్మాయి బయటికి వచ్చేసింది. దాంతో నాకు కోపం వచ్చేసింది .. అప్పటికి 12 రోజుల పాటు షూటింగు జరిగింది. అయినా ఫరవాలేదు .. ఈ అమ్మాయిని ఇంటికి పంపించేయండి .. మరో హీరోయిన్ తో చేద్దాం అని ప్రొడక్షన్ మేనేజర్ కి చెప్పాను. దాంతో పూర్ణ .. ఆమె తల్లి సారీ చెప్పడంతో మళ్లీ షూటింగు మొదలైంది. ఆ తరువాత పూర్ణతో రెండు మూడు సినిమాలు తీశాను" అని చెప్పుకొచ్చాడు.
Tue, Oct 15, 2019, 12:16 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View