కార్తీ 'ఖైదీ' విడుదల తేదీ ఖరారు
Advertisement .b
కార్తీ కథానాయకుడిగా తమిళంలో 'ఖైదీ' సినిమా నిర్మితమైంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో, పారిపోయిన ఖైదీగా కార్తీ కనిపించనున్నాడు. ఆయన ఎందుకు ఖైదీగా మారవలసి వచ్చిందనే అంశం నేపథ్యంలో ఈ సినిమా కథ ఆసక్తికరంగా కొనసాగనుంది.

ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా విడుదల తేదీపై అంతా దృష్టి పెట్టారు. తెలుగులో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న కె.కె.రాధామోహన్, ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ .. రొమాన్స్ .. పాటలు లేవని ముందుగానే చెప్పేసి విడుదల చేస్తుండటం విశేషం.
Tue, Oct 15, 2019, 11:46 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View