బన్నీ సినిమా భారీ వసూళ్ల కోసం అలా ప్లాన్ చేశారు
Advertisement
త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో 3వ సినిమాగా 'అల వైకుంఠపురములో' రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను దక్కించుకున్న బ్లూ స్కై సినిమాస్ వారు అక్కడ అత్యధిక స్క్రీన్లపై విడుదల చేయనున్నారు.

అయితే ఇటీవల కాలంలో థియేటర్స్ లో సినిమా ఉన్నప్పటికీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోనే చూడటానికి అక్కడ అంతా అలవాటు పడిపోయిన కారణంగా, థియేటర్స్ వైపు నుంచి వచ్చే వసూళ్లు పడిపోయాయి. అందువలన 'అల వైకుంఠపురములో' థియేటర్స్ లో ఉన్నంతవరకూ అమెజాన్ ప్రైమ్ లో గానీ .. నెట్ ఫ్లిక్స్ లో చూసే అవకాశం ఉండదు అంటూ బ్లూ స్కై సినిమాస్ వారు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ నిర్ణయం కారణంగా ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tue, Oct 15, 2019, 10:08 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View