'అల్లరి' నిర్మాత ఆ సినిమా తప్పకుండా ఫ్లాప్ అవుతుందన్నాడు: దర్శకుడు రవిబాబు
Advertisement
విభిన్నమైన పాత్రలను పోషించిన నటుడిగా .. విలక్షమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా రవిబాబుకి ప్రత్యేకస్థానం వుంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఆవిరి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన తొలి చిత్రమైన 'అల్లరి'గురించి ప్రస్తావించాడు.

'అల్లరి' సినిమాను పూర్తి కొత్తదనంతో రూపొందించాలనుకున్నాను. ముందుగా అనుకున్నట్టుగానే 40 రోజుల్లో .. బడ్జెట్ పరిథిలోనే పూర్తి చేశాను. నాతో పాటు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన వ్యక్తికి ఈ సినిమా నచ్చలేదు. 'సినిమా చాలా చెత్తగా వుంది .. అనవసరంగా తీశాము .. తప్పకుండా ఫ్లాప్ అవుతుంది' అన్నాడు. దాంతో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ చివరికి నా జడ్జిమెంట్ ను నిజం చేస్తూ ఈ సినిమా సక్సెస్ అయింది" అని చెప్పుకొచ్చాడు.
Tue, Oct 15, 2019, 09:42 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View