అమెరికా వెళుతోన్న మెగా హీరో
Advertisement .b
ఆరంభంలో యూత్ కి మాత్రమే నచ్చే సినిమాలు చేస్తూ వచ్చిన మారుతి, ఆ తరువాత తన రూటు మార్చుకుని, యూత్ తో పాటు కుటుంబ సమేతంగా చూడదగిన వినోదభరిత సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆ దారిలోనే ఆయన తాజా చిత్రంగా 'ప్రతీరోజూ పండగే' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో కుటుంబాలు - అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది.

 కథాపరంగా కొంత చిత్రీకరణ విదేశాల్లోను వుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. సాయిధరమ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన రాశిఖన్నా నటిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో సత్యరాజ్ .. రావు రమేశ్ కనిపించనున్నారు.
Mon, Oct 14, 2019, 06:07 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View