'వెంకీమామ' విడుదల తేదీ ఖరారు
Advertisement .b
వెంకటేశ్ - నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' రూపొందుతోంది. చైతూ జోడీగా రాశిఖన్నా .. వెంకటేశ్ సరసన పాయల్ నటిస్తున్న ఈ సినిమా, పూర్తి వినోదభరితంగా నిర్మితమవుతోంది. మేనమామ - మేనల్లుడు ప్రధాన పాత్రలుగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం కావడంతో, సంక్రాంతి బరిలో నిలపడమే మంచిదనే ఉద్దేశంతో జనవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఇక మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' .. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే నిలవనున్నాయి. ఈ మూడు సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర ఏది విజేతగా నిలుస్తుందో చూడాలి.
Mon, Oct 14, 2019, 05:18 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View