'ఇద్దరి లోకం ఒకటే' నుంచి ఫస్టు సింగిల్
Advertisement .b
రాజ్ తరుణ్ - షాలినీ పాండే జంటగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు బ్యానర్లో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"నువ్వే నువ్వే నువ్వేకదా .. నా తోడు నువ్వే కదా, నీకూ నాకూ వుందో కథా .. ఆ పేరు ప్రేమే కదా .. యూ ఆర్ మై హార్ట్ బీట్" అంటూ ఈ పాట సాగుతోంది. మిక్కీ జె.మేయర్ సంగీతం .. బాలాజీ సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఫీల్ తో కూడిన ఈ మెలోడీ యూత్ హృదయాలకి కనెక్ట్ అయ్యేలానే వుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రాజ్ తరుణ్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.
Mon, Oct 14, 2019, 04:34 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View