మళ్లీ విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి వంగా
Advertisement .b
తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయ్ దేవరకొండకి స్టార్ డమ్ తెచ్చిపెట్టేసింది. ఆయనను యూత్ కి చాలా చేరువగా తీసుకెళ్లింది. అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో సందీప్ రెడ్డి తెరకెక్కించగా, అక్కడ కూడా ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమా నిర్మాతలతోనే సందీప్ రెడ్డి వంగా హిందీలో మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలోనే వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు తరువాత తన సినిమా విజయ్ దేవరకొండతోనే వుండనున్నట్టు చెప్పాడు. సందీప్ రెడ్డి వంగా ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం వలన, వచ్చే ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Mon, Oct 14, 2019, 04:08 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View