నితిన్ కొత్త సినిమా టైటిల్ 'చదరంగం' కాదట!
Advertisement
ప్రస్తుతం నితిన్ చేతిలో 3 సినిమాలు వున్నాయి. ఈ మూడు సినిమాల్లో ముందుగా 'భీష్మ' సెట్స్ పైకి వెళ్లింది. రష్మిక కథానాయికగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' రూపొందనుంది. ఈ సినిమాలో నితిన్ జోడీగా కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ రెండు సినిమాలతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోను నితిన్ ఒక సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాకి 'చదరంగం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఒకటి రెండు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదట. అసలు ఆ టైటిల్ వాళ్ల పరిశీలనలోనే లేదని సమాచారం. ఈ సినిమా టైటిల్ ను నవంబర్ లో ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా ప్రియాప్రకాశ్ వారియర్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
Mon, Oct 14, 2019, 02:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View