క్రికెటర్ శ్రీశాంత్ కు జోడీగా హన్సిక .. మరో హారర్ చిత్రానికి శ్రీకారం
Advertisement
తమిళంలో అందాల కథానాయికగా అభిమానుల నుంచి విశేషంగా ఆదరణ పొందిన వారిలో హన్సిక కూడా కనిపిస్తుంది. అక్కడి అగ్రకథానాయకులందరితోను కలిసి నటించిన హన్సిక, హారర్ చిత్రాల ద్వారా కూడా భారీ విజయాలను అందుకుంది. అలాంటి హన్సిక త్వరలో మరో హారర్ థ్రిల్లర్లో చేయడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో ఆమెకు జోడీగా క్రికెటర్ శ్రీశాంత్ కనిపించనున్నాడు. క్రికెట్ కి దూరమైన ఆయన అప్పటి నుంచి సినిమాల వైపు ఆసక్తిని చూపుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. 3D టెక్నాలజీతో రంగనాథన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హరిశంకర్ - హరీశ్ నారాయణ్ దర్శకులుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయనుండటం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాను, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
Mon, Oct 14, 2019, 01:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View