ప్రత్యేక విమానంలో సతీసమేతంగా విజయవాడ చేరుకున్న చిరంజీవి.. మధ్యాహ్నం జగన్ తో విందు
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడానికి మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా బయల్దేరారు. హైదరాబాదు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద చిరంజీవికి మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, 'జై మెగాస్టార్' అంటూ నినాదాలు చేశారు. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం నివాసానికి చిరంజీవి దంపతులు చేరుకుంటారు. ఈ సందర్భంగా జగన్ తో కలసి విందు చేస్తారు.

మరోవైపు జగన్, చిరంజీవి భేటీపై రాజకీయ వర్గాల్లో కూడా భారీ చర్చ జరుగుతోంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే... జగన్ సీఎం అయ్యాక చిన్న నటులే తప్ప అగ్ర నటులు కానీ, ఇతర సినీ ప్రముఖులు కానీ ఆయనను కలవలేదు. ఈ నేపథ్యంలో, జగన్ ను చిరంజీవి కలవనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ కలయిక వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనని చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు.
Mon, Oct 14, 2019, 12:22 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View