షాహిద్ కపూర్ హీరోగా హిందీలోకి 'జెర్సీ'
Advertisement
తెలుగులో ఈ ఏడాది ఏప్రిల్లో 'జెర్సీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెట్ నేపథ్యం .. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా వ్యవహరించాడు. నాని కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఆయన కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది.

తెలుగులో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను, హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ రంగంలోకి దిగాడు. అల్లు అరవింద్ - దిల్ రాజు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు. తెలుగులో 'జెర్సీ' సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరియే హిందీ రీమేక్ కి కూడా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'తో హిట్ కొట్టేసిన షాహిద్, 'జెర్సీ' రీమేక్ తోను మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
Mon, Oct 14, 2019, 12:19 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View