ఐఆర్సీటీసీ షేరుకు విశేష ఆదరణ... లిస్టింగ్ చేసిన నిమిషాల వ్యవధిలో రెట్టింపు లాభం!
14-10-2019 Mon 12:11
- నేడు లిస్టింగ్ అయిన ఐఆర్సీటీసీ
- 101 శాతం పెరిగిన ఈక్విటీ ధర
- రూ. 10,972 కోట్లకు కంపెనీ వాల్యూ

ఇటీవల ఐపీఓకు వచ్చి నిధులను సమీకరించుకున్న రైల్వే ఆన్ లైన్ టికెటింగ్, టూరిజం కేటరింగ్ కంపెనీ ఐఆర్సీటీసీ, నేడు స్టాక్ మార్కెట్ లో తొలి రోజు లిస్టింగ్ అయింది. ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సంస్థ ఈక్విటీ విలువ అదరగొట్టే రేంజ్ లో దూసుకెళ్లింది. రూ. 320 ఇష్యూ ప్రైస్ కాగా, ఏకంగా 101 శాతం లాభపడి రూ. 644కు చేరింది. ఎన్ఎస్ఈలో రూ. 95. శాతం పెరిగింది. దీంతో ఐఆర్సీటీసీ సంస్థ మార్కెట్ విలువ రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 10,972 కోట్లకు చేరుకుంది.
కాగా, కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్ మెంట్ విధానంలో భాగంగా, ఐఆర్సీటీసీలో వాటాలను విక్రయించి రూ. 645 కోట్లను సేకరించిన సంగతి తెలిసిందే. ఐపీఓకు వచ్చిన రైల్వేలకు చెందిన నాలుగో సంస్థగా ఐఆర్సీటీసీ నిలిచింది. గతంలో ఆర్ఐటీఈఎస్, రైల్ వికాస్ నిగమ్, ఐఆర్సీవోఎన్ లు ఐపీఓలకు వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
6 hours ago

ద్రౌపది ముర్ముపై మరోసారి వ్యాఖ్యలు చేసిన వర్మ
6 hours ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
7 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
8 hours ago
